Thursday, December 12, 2013

ఈ ఆట పేరు __:__

ఏమిటని? ఎందుకని ?ఎంతవరకని?
అని అని అలిసిపోయే నా మనసు
మక్కి మక్కి గా నక్కి చూసేను సంఘటనలు
మరి వెక్కిరిస్తూ మరి వోదారుస్తూ
వెడలి వెడలి సడలిన బడలిక తోటి హడలి
నింగి కేసి  చుసిన నా కనులలోని భాష
ఎ జీవికి అర్ధం కాదుగా అని లోలోన ఘోష
వేడి కన్నీరు తలపే వెన్ను దన్ను నాలో
పదీ పదీ నిలదీసి అడిగింది నన్ను
అందుకు భేలగా చూస్తుండి పోయింది కన్ను
ఎటు వైపు ఈ జగత్ ప్రయాణం అన్నా
అందుకు నాకు దొరికిన జవాబు నిండు సున్నా
క్లెసములథొ కూడిన శేషం ప్రతి దినం
ఏది తోచని, ; ఎటువైపు చూడలేని కనుల కణం
గిరి గీసిన చట్టరీతిని సృష్టించిన నిష్టూరజనం
అరమరికలు లేని వైనం ఈ జగత్ చందం
వాస్తవానికి మిక్కిలి దూరమైనదే ఈనాటి అందం
సహజనుభవ సౌందర్యం మనిషికి ద్వంద్వం
వినినా కనినా కేవలం ఒక్కటే సమస్తాభివ్యక్తం
నీకందరు ఉన్నానీకు నీవు లేని నాడు నరకమే నరకం

No comments:

Post a Comment